సామాజిక విప్లవ యోధుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్..


Ens Balu
3
Kakinada
2021-12-06 17:03:45

భారత రాజ్యాంగ నిర్మాత గానే కాకుండా సామాజిక విప్లవ సారథిగా పలు సంస్కరణలు ప్రవేశపెట్టిన అపర మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని వాకర్స్ జిల్లా కౌన్సిలర్ అడబాల రత్న ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ సర్పవరం జంక్షన్ లో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం  ఆధ్వర్యంలో డా.బి.ఆర్.అంబేద్కర్ 65 వ వర్ధంతి ఘనంగా నిర్వహఇంచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడబాల  మాట్లాడుతూ, దేశ లౌకిక వాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది అంటే అందుకు అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగమే కారణమన్నారు. ఆధ్యాత్మికవేత్త రవి శంకర్ పట్నాయక్ మాట్లాడుతూ, సామాజిక పరివర్తనుడు, గొప్ప స్ఫూర్తి ప్రదాత, గొప్ప రాజనీతిజ్ఞుడు, రాజకీయవేత్త, న్యాయ శాస్త్ర కోవిదుడు అయిన అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు. ఆయన బౌద్ధమతాన్ని స్వీకరించారని తెలిపారు. 1956 డిసెంబర్ 6 న కాలం చేశారని  తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సువర్ణ రాజు, ఆర్ రాజా తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు