మచ్చలేని ప్రజా సేవకులు పొట్టి శ్రీరాములు..
Ens Balu
5
Kakinada
2021-12-15 07:31:40
ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు మచ్చలేని ప్రజా సేవా తత్పరుడు అని వాకర్స్ జిల్లా కౌన్సిలర్ అడబాల రత్న ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టి గాంధీ ఆదర్శాలకు, ఆశయాలకు ప్రభావితుడై స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న శ్రీ రాములు 58 రోజులపాటు ఆహార నిరాహారదీక్ష చేసి అసువులు బాసారన్నారు. ఆయన ఆత్మ త్యాగ ఫలితంగా రాష్ట్రం ఏర్పడిందని తదనంతరం తెలంగాణ ఉద్యమంతో తెలుగు రాష్ట్రం రెండుగా విభజింపబడినట్టు అడబాల తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రవిశంకర్ పట్నాయక్ ,రాఘవరావు, బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.