దేశభక్తికి ప్రతీక సర్ధార్ వల్లభాయ్ పటేల్..
Ens Balu
4
Kakinada
2021-12-15 07:33:58
ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అకుంటిత దేశభక్తికి ,సమైక్య భారత నిర్మాణ దక్షతకు ప్రతీక అని ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, క్విట్ ఇండియా ఉద్యమంతో పాటు అన్ని జాతీయ ఉద్యమాల్లో పటేల్ ముందు నిలిచారని కొనియాడారు. స్వతంత్ర భారతానికి తొలి ఉప ప్రధానిగా, హోం మంత్రిగా ఆయన చేసిన సేవలు, తీసుకున్న చర్యలు సుస్థిర భారత రూపకల్పనకు తోడ్పడ్డాటు అయ్యాయని పట్నాయక్ గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాఘవ రావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.