అన్నవరం దేవస్థానంలోనూ ఇక డయల్ యువర్ ఈఓ..
Ens Balu
3
Annavaram
2021-12-20 12:18:34
తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీశ్రీశ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్ధం ప్రతీనెలా మొదటి సోమవారం మరియు ఆఖరి సోమవారం డయల్ యువర్ ఈఓ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు దేవస్థాన ఈఓ వేండ్ర త్రినాధరావు తెలియజేశారు. ఈ మేరకు సోమవారం ఆయన స్థానిక మీడియాకి ప్రకటన విడుదల చేశారు. స్వామివారి దర్శనాల దగ్గర నుంచి అన్ని రకాల సేవలు, వసతుల తదితర అంశాలపై భక్తులు ఫోన్ నెం:08868-238127 నెంబరుకు ఉదయం 10.30 నుంచి11.30 వరకు ఫోన్ చేసి మాట్లాడవచ్చునని చెప్పారు. అదే సమయంలో భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించే విషయంలో భక్తులు తమ అమూల్యమైన సూచనలు, సలహాలు ఇవ్వడంతోపాటు, దేవస్థానానికి సంబంధించిన ఏ విషయంపై అయినా నేరుగా ఈఓతో మాట్లాడవచ్చునని ఈఓ మీడియాకి జారీచేసిన ప్రకటనలో తెలియజేశారు.