తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం రైతుబజార్ లలో పార్కింగ్ కోసం ప్రదేశం లీజుకి ఇచ్చేనిమిత్తం ఈనెల 16వ తేదీ నుంచి ఈ-టెండర్లు పిలుస్తున్నట్టు మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సూర్యప్రకశారెడ్డి తెలియజేశారు. ఈ మేరకు సోమవారం కాకినాడ రూరల్ లోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ-టెండర్లు 16వ తేదీ నుంచి ఈ నెల 31వ తేదీ వరకూ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయన్నారు. ఆశక్తివున్న టెండరు దారులు మార్కెటింగ్ శాఖ ఆన్ లైన్ పోర్టల్ ను సందర్శించాల్సి వుంటుందని ఆయన చెప్పారు. వీటితోపాటు, కేంటీన్లు, డిస్ప్లే బోర్డులకు కూడా ఈ- టెండర్లు ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. ఈ అవకాశాన్ని టెండరు దారులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలిని మార్కెటింగ్ శాఖ ఏడీ ఈ సందర్భంగా మీడియా ద్వారా కోరారు.