ఓటిఎస్ తో ఇంటి భూమిని సొంతమవుతుంది..
Ens Balu
3
Karapa
2021-12-22 13:17:11
వన్ టైమ్ సెటిల్ మెంట్ తో నిరుపేదల పేరుతోనే ఇంటి భూమిని సొంతం చేసే విధంగా ఒటిఎస్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. బుధవారం కరప మండల కేంద్రంలోని శ్రీ కొణిదెల చిరంజీవి కల్యాణ మండపం జరిగిన సంపూర్ణ గృహ హక్కు పథకం కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు గృహ హక్కు పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఓటిఎస్ ద్వారా ఇంటిపై వున్న హౌసింగ్ రుణబాధలు తొలగిపోవడంతో పాటు భూమి రిజిస్ట్రేష్ అయి సొంతం అవుతుందన్నారు. అధికారులు ఈ విషయాన్ని లబ్దిదారులకు తెలియజేసి శతశాతం ఓటిఎస్ పూర్తి అయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ కె.స్వప్న, నియోజవర్గస్థాయి వైఎస్సార్సీపీ నాయకులు, అధిక సంఖ్యలో లబ్దిదారులు పాల్గొన్నారు.