మితాహారం తోనే మనందరికీ మంచి ఆరోగ్యం..


Ens Balu
4
Kakinada
2021-12-22 13:18:09

మన  దైనందిన కార్యక్రమాలకు ప్రతి వ్యక్తికి శక్తి అవసరమని ,అవి ఆహార పదార్థాల ద్వారా లభిస్తాయని అయితే వాటిని మితంగా తీసుకోవాలని ప్రకృతి వైద్యులు డాక్టర్ వేదుల శ్రీరామ శర్మ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ  సర్పవరం జంక్షన్  బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మన ప్రాంతంలో అధికంగా అన్నం తినడం వలన మధుమేహం రావడానికి ఒక కారణం అన్నారు. మధుమేహ నియంత్రణకు ఆహార నియమాలు అవసరమన్నారు. తృణధాన్యాలలో ప్రోటీన్, పీచు పదార్థం అధికంగా ఉంటాయన్నారు. ప్రతి రోజు ఉదయం నిద్ర లేవగానే గోరువెచ్చని నీటిని తాగాలని అన్నారు. దీనివలన శరీరంలోని మలినాలు విసర్జింపబడతాయి అని అన్నారు. సంపూర్ణ జీవనానికి సమగ్రమైన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ వేదుల తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు