కరప మండలంలో పారదర్శకంగా వీధిబాలల సర్వే..


Ens Balu
3
Karapa
2021-12-27 17:10:29

కరప మండలంలోని అన్ని గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల పరిధిలో వీధిబాలల సర్వే చేపడుతన్నట్టు మండల విద్యాశాఖ అధికారిణి కె.క్రిష్ణవేణి తెలియజేశారు. ఈ మేరకు సోమవారం కరపలోని ఆమె తన కార్యాయలంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల మేరకు బాలలు ఎవరూ పనిలోకి కాకుండా బడిలోకే వెళ్లాలనే నినాదంలో వీధి బాలల సర్వే చేపడుతున్నట్టు చెప్పారు. తల్లిదండ్రులు ఎవరూ బాలలను పనిలోకి పంపకూడదని ఈ సందర్భంగా ఎంఈఓ సూచించారు. బాలలను బడికి పండం ద్వారా అన్ని సౌకర్యాలతో కూడిన విద్యను అందించడానికి ఆస్కారం వుంటుందని చెప్పారు. ప్రస్తుతం మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల పరిధిలోని సీఆర్టీలు ఈ వీధిబాలల సర్వే కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహస్తున్నట్టు ఎంఈఓ తెలియజేశారు.
సిఫార్సు