కరప మండలంలో 16 మంది వీధి బాలల గుర్తింపు..


Ens Balu
4
Karapa
2021-12-30 14:31:57

కరప మండలంలో ఇప్పటి వరకూ 16 మంది వీధి బాలలను గుర్తించినట్టు కరప ఎంఈఓ కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ మేరకు గురువారం స్థానిక మీడియాకు ప్రకటన విడుదల చేసింది. ఒక్క పెనుగుదురు గ్రామంలో అత్యధికంగా ఈ పదిమంది, చిన కొత్తూరు బట్టీలో ముగ్గురు, ఆర్ కేఆర్ నగర్ లో ముగ్గుని గుర్తించినట్టు అధికారులు పేర్కొన్నారు.  వీరిలో పెనుగుదురు లో గుర్తించిన పది మంది గుంటూరు జిల్లా నుంచి వలస వచ్చిన వారిగా వివరాలు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. మిగిలిన ముగ్గురు బాలలకు ఆధార్ కార్డులు కూడా లేవని ఆ ప్రకటనలో తెలియజేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గుర్తించిన బాలల సమాచారాన్ని జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి తెలియజేసినట్టు ఆ ప్రకటనలో మండల విద్యాశాఖ కార్యాలయం పేర్కొంది.
సిఫార్సు