దివ్య జ్యోతి స్వరూపం భగవాన్ రమణ మహర్షి..
Ens Balu
2
Kakinada రూరల్
2021-12-30 14:32:57
మౌన సందేశం ద్వారా ఆత్మజ్ఞానాన్ని, చిత్త శాంతిని భక్తులకు అనుగ్రహించిన దివ్య జ్యోతి స్వరూపులు భగవాన్ రమణ మహర్షి అని ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. గురువారం కాకినాడ సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో రమణ మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్నాయక్ మాట్లాడుతూ, 1879 డిసెంబర్ 30న తమిళనాడు తిరుచ్చిలో రమణ మహర్షి జన్మించారన్నారు. నీ గురించి నీవు తెలుసుకోవడమే జ్ఞానమని చెప్పిన భగవాన్ రమణ మహర్షిని నిర్గుణ పరబ్రహ్మ స్వరూపంగా ఆధ్యాత్మిక ప్రపంచం అంతా ప్రస్తుతస్తుందని పట్నాయక్ తెలిపారు. ఆయన ఎందరికో ఆదర్శప్రాయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.