జనవరి 4న అదనపు మండల ఉపాధ్యక్షుడి ఎన్నిక..
Ens Balu
2
Karapa
2021-12-30 14:35:42
కరప మండలంలో జనవరి 4వ తేదిన మండల ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహిస్తున్నట్టు ఎంపీడీఓ కె.స్వప్న తెలియజేశారు. ఈ మేరకు గురువారం ఆమె తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ ఎన్నిక నిర్వహిస్తున్నామన్నారు. అరోజు జరిగే ఎన్నికకు మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం సభ్యులంతా హాజరు కావాల్సి వుంటుందన్నారు. ఒక వేళ ఆరోజు ఎన్నిక ఏ కారణం చేతనైనా నిలిచిపోతే మరుసటి రోజునైనా ఎన్నిక నిర్వహిస్తామని ఆమె తెలియజేశారు. ఎన్నికల నియమావళిని అనుసరించి పూర్తిస్థాయిలో ఎన్నికకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఈ సందర్భంగా ఎంపీడీఓ మీడియాకి వివరించారు.