కరాటే తో ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది..


Ens Balu
7
Kakinada
2022-01-05 14:46:45

నేటి ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ కరాటేలో శిక్షణ  పొందడం వలన ఆత్మ విశ్వాసం   ఇనుమడిస్తుంది అని రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ వై డి రామారావు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ బోట్ క్లబ్ ఉద్యానవనంలో   గోజూరియా కరాటే శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల వారణాసిలో 6వ ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్   కరాటే పోటీలలో విజేతలైన బాలబాలికలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను   రామారావు  బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ  నేటి బాలబాలికలకు శారీరక వ్యాయామం లోపించిందన్నారు. ఇటువంటి కరాటే శిక్షణ వలన శారీరక వ్యాయామం చేకూరి ఆరోగ్యంగా జీవిస్తారని అన్నారు. కరాటే శిక్షకులు ఎల్ సూర్య మాట్లాడుతూ వారణాసిలో  జరిగిన కరాటే పోటీలో   ఎనిమిది స్వర్ణ, ఆరు రజిత, ఒక కాంస్య పతకాలను బాల బాలికలు సాధించారని  తెలిపారు. ఈ కార్యక్రమంలో బోట్ క్లబ్ వాకర్స్  సంఘ  అధ్యక్షులు అడబాల రత్న ప్రసాద్, ఏం సుబ్బారావు ఎన్ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు