తూర్పుగోదావరిజిల్లాలోని కరప మండలంలో వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య పర్యటించనున్నారని మండల వ్యవసాయాధికారిణి ఏ.గాయత్రీ దేవి తెలియజేశారు. ఈమేరకు బుధవారం ఆమె స్థానిక మీడియాకి ప్రకటన విడుదల చేశారు. పూనం మాలకొండయ్య తన పర్యటనలో బాగంగా కరప మండలంలో ధాన్యం కొనుగోలును పర్యవేక్షించడంతోపాటు రైతులతోనూ సమావేశం అవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండలం కేంద్రంలోని వ్యవసాయ సిబ్బంది మరియు రైతు భరోసా కేంద్రాల పరిధిలోని గ్రామీణ వ్యవసాయ సహాయకులను వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పర్యటనకు సమాయత్తం చేసినట్టు మండల వ్యవసాయాధికారిణి ఈ సందర్భంగా మీడియాకి వివరించారు.