అడబాల కు అంతర్జాతీయ వాకర్స్ సంఘ అవార్డు..
Ens Balu
3
Kakinada
2022-01-05 14:48:57
సొంత నిధులతో నిత్యం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకం అవుతున్న అడబాల రత్న ప్రసాద్ అభినందనీయులని కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీత పేర్కొన్నారు. కాకినాడలోని ఎంపీ కార్యాలయంలో అంతర్జాతీయ వాకర్స్ సంఘం అడబాల కు ప్రకటించిన అవార్డును ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అడబాల ఏడాదిలో 365 రోజులు ఏదోవిధంగా పేదలకు సహాయం అందిస్తున్నారని అభినందించారు. ఆయన స్పూర్తితో మరింత మంది దాతలు ముందుకి వచ్చి నిరుపేదలకు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లో పి.వి రాఘవరావు, రాజా, రవిశంకర్ పట్నాయక్ ,రేలంగి బాపిరాజు, గోపాలకృష్ణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.