గురు గోవింద్ సింగ్ కవి, గొప్ప జ్ఞాని అని ఆధ్యాత్మికవేత్త కె వి శాస్త్రి పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో గురు గోవింద్ సింగ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రి మాట్లాడుతూ సిక్కులకు ఆయన పదవ గురువు అన్నారు. గురుగోవింద్ సింగ్ పాట్నాలో 1666 జనవరి 5న జన్మించారని అన్నారు. ఆయన మత స్వేచ్ఛ కోసం మొఘల్ పాలకుల కు వ్యతిరేకంగా సైన్యాన్ని తయారు చేసిన గొప్ప ధైర్యశాలి అని అన్నారు. ఆయన ఆధ్యాత్మిక వేత్త మరియు తత్వవేత్త ని కొనియాడారు. దేశవ్యాప్తంగా గురు గోవింద్ సింగ్ జయంతి ని ఘనంగా నిర్వహిస్తారని శాస్త్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు, రాజా తదితరులు పాల్గొన్నారు.