రేపు సూర్యాపేటలో సాంప్రదాయ సంక్రాంతి సంబరాలపై అవగాహనా ర్యాలీ..


Ens Balu
3
Timmapuram
2022-01-06 14:53:01

కాకినాడ రూరల్ పరధిలోని తిమ్మాపురం పోలీస్ ఆధ్వర్యంలో రేపు సూర్యాపేటలో సాంప్రదాయ సంక్రాంతి సంబరాలపై అవగాహన ర్యాలీ చేపడుతున్నట్టు ఎస్ఐ రామక్రిష్ణ తెలియజేశారు. ఈ మేరకు గురువారం స్థానిక మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా స్థానిక శివాలయం నుంచి లైట్ హౌస్ సెంటర్ వరకూ ఈ ర్యాలీ నిర్వహించనున్నారని అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నామని అన్నారు.  ఈ ర్యాలీలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతోపాటు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువత కూడా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్ఐ రామక్రిష్ణ మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

సిఫార్సు