గ్రామాల్లో సాంప్రదాయ సంక్రాంతి సంబరాలకు పెద్దపీటవేయాలి..


Ens Balu
4
Karapa
2022-01-06 17:56:40

గ్రామాల్లో సాంప్రదాయ సంక్రాంతి సంబరాలకు పెద్దపీటవేసి పండుగలు ఆనందంగా జరుపుకోవాలి తప్పితే జూద క్రీడలు ఆడి ఆర్ధికంగా నష్టపోకూడదని కరప ఎంపీడీఓ కె.స్వప్న సూచించారు. గురువారం కరప మండలంలోని గురజనాపల్లి గ్రామంలో కరప స్టేషన్ ఎస్ఐ డి.రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహనా ర్యాలీలో తహశీల్దార్ శ్రీనివాసరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ, ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలు సంక్రాంతి పండుగను ఆనందంగా, సంతోషంగా చేసుకోవాలనే లక్ష్యంతో జూదాలను నియంత్రించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అలాంటి మంచి కార్యక్రమంలో స్థానికులు, అధికారులతో పాల్గొనడం ఆనందంగా వుందన్నారు. జూద సంక్రాంతి కాకుండా సరదాల సంక్రాంతికే ప్రజలు మొగ్గు చూపాలని ఎంపీడీఓ ఈ సందర్భంగా పిలుపుచినిచ్చారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధకశాఖ అధికారి శివప్రసాద్, ఎంఆర్ఐ పూర్ణచంద్రరావు, సచివాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.
సిఫార్సు