క్రీడలు, ముగ్గుల పోటీలతోనే సంక్రాంతి పండుగకు అసలైన కళ..
Ens Balu
3
Karapa
2022-01-06 17:57:37
నిజమైన సంక్రాంతి పండుగ అంటే సరదా సరదా క్రీడలు, గ్రామాలకు అందాన్ని ఇచ్చే ముగ్గుల పోటీలేనని కరప తహశీల్దార్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం కరప మండలంలో కోడి పందాలు వద్దు సాంప్రదాయ సంక్రాంతి ముద్దు అనే కార్యక్రమంలో భాగంగా వేములవాడ జిల్లా పరిషత్ హైస్కూలు కరప ఎస్ఐ డి.రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీల్లో ఎంపీడీఓ కె.స్వప్నతోపాటు పాటు కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ, ప్రజలందరూ సంక్రాంతి పండుగను ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలన్నారు. పండు సమయాల్లో యువత క్రీడల్లో పాల్గొని వారు గెలుపొందిన బహుమతులను మంచి తీపి గుర్తులుగా దాచుకోలన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామస్తులు అన్నిశాఖల సిబ్బందితోపాటు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.