దిశయాప్ వినియోగంపై విద్యార్ధులకు మరింత అవగాహన..
Ens Balu
4
Sankhavaram
2022-01-18 07:16:34
దిశయాప్ వినియోగం డౌన్లోడ్ పై పాఠశాల, కళాశాల స్థాయిలో మరింత అవగాహన కల్పిస్తున్నట్టు శంఖవరం మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష తెలియజేశారు. మంగళవారం శంఖవరంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళలకు అన్ని సమయాల్లో రక్షణగా దిశయాప్ నిలుస్తుందన్నారు. దిశయాప్ వినియోగం వలన మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఒంటరిగా ప్రయాణం చేయవచ్చునన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే దిశయాప్ ని వినియోగించి పోలీసుల సహాయం కూడా పొందవచ్చునన్నారు. ఈ యాప్ వలన ఒక్క మహిళలే కాకుండా పురుషులు కూడా ఎదుట వారికి సహాయం చేయడానికి వీలుపడుతుందని చెప్పారు. ప్రతీ ఒక్కరూ ప్రభుత్వం అత్యవసర సమయంలో రక్షణగా నిలవడానికి అందుబాటులోకి తీసుకువచ్చిన దిశయాప్ ని డౌన్ లోడ్ చేసుకోవాలని మీడియా ద్వారా ప్రజలకు మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష పిలుపునిచ్చారు.