బడిఈడు పిల్లల నమోదు పక్కాగా నిర్వహించాలి..


Ens Balu
1
Karapa
2022-01-18 16:26:44

కరప మండలంలోని బడిఈడు పిల్లలను గుర్తించి మన బడికి పోదాం యాప్ లో పక్కాగా నమోదు చేయాలని మండల విద్యాశాఖ అధికారణి క్రిష్ణవేణి స్కూలు హెచ్ఎంలకు సూచించారు. మంగళవారం కరప విద్యావనరుల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఉపాద్యాయులకు ఆమె దిశా నిర్ధేశం చేశారు. ప్రభుత్వం ఎంతో ఉన్నత లక్ష్యంతో బడిఈడు పిల్లలను బడిలోకి చేర్పించే కార్యాక్రమాన్ని అమలు చేస్తుందన్నారు. వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయాలంటే పాఠశాలల ఉపాధ్యాయులు శ్రమించాల్సి వుంటుందన్నారు. బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే బాధ్యతను చక్కగా నిర్వహించాలన్నారు. అదే సమయంలో యాప్ లో వివరాలు నమోదు జరిగే సమయంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తినా తక్షణమే తెలియజేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలోని మండలంలోని పాఠశాలల హెచ్ఎంలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సిఫార్సు