జనవరి 29 వరకూ బడిబయట పిల్లల గుర్తింపు కార్యక్రమం..


Ens Balu
3
karapa
2022-01-19 16:36:53

కరప మండలంలో బడి బయట పిల్లలును గుర్తించేందుకు  19 మంది ఎన్యూమరేటర్లను నియమించినట్టు మండల విద్యాశాఖ అధికారిణి క్రిష్ణవేణి తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఆమె కరపలోని విద్యావనరుల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. ఈ బడి బయట పిల్లల గుర్తింపు కార్యక్రమం ఈనెల 29 వరకూ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. దానికోసం ఎన్యూమరేటర్లు హేబీటేషన్స్ వారిగా వివరాల సేకరణ చేపడతారని వివరించారు. ఆ వివరాలను మన బడికిపోదాయం యాప్ లో నమోదు చేయాల్సి వుంటుందన్నారు. అలా మండలంలో ఎంత మంది బయడి బయట పిల్లలు వున్నారనే సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయనున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ఏవిధంగా చేపట్టాలనే విషయమై ఇప్పటికే ఎన్యూమరేటర్లకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చినట్టు ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారిణి క్రిష్ణవేణి మీడియాకి తెలియజేశారు.
సిఫార్సు