నీ దమ్మేంటో సర్పంచ్ ఎన్నికల్లోనే తేలిపోయింది.. సత్యంనాయుడు ఎద్దేవా..


Ens Balu
6
Krishnadevipeta
2022-01-25 03:49:13

గ్రామ సర్పంచ్ ఎన్నికలలో ఒక్క వార్డు నెంబర్ ని గెలిపించుకో లేకపోగా సర్పంచ్ అభ్యర్థిగామూడో స్థానానికి దిగజారిన వ్యక్తివి నువ్వా దమ్ము గురించి మాట్లాడటం.. ముందు నీకోసం ప్రజలు ఏవిధంగా చెబుతున్నారు.. ఎంతలా చెప్పుకుంటున్నారో తెలుసుకోవాలని పాత కృష్ణదేవిపేట సర్పంచ్ పందిరి సత్యన్నారాయణ(సత్యం నాయుడు), వైకాపా నాయకుడు పుట్టా సూర్య ప్రకాష్ (చిన్నస్వామి) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు వారంతా పాత కృష్ణదేవిపేటలో మీడియాతో మాట్లాడారు. దళిత మహిళ స్థలం సమస్యను వివాదంగా మార్చి నిరాధారమైన ఆరోపణలు మంచిది కాదని హితవు పలికారు. ఇప్పటికే గ్రామంలో 119, 120 సర్వే నెంబర్ గల భూమిని సర్వే చేయమని మండల తహసీల్దార్ కు దరఖాచేశామన్నారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా పార్టీలకతీతంగా కలసి పని చేయడానికి తామెప్పుడూ సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ఇండ్ల స్థలాల పట్టాలు మంజూరు విషయంలో అర్హులైన వారి పట్టాలను మామూళ్ళు ఇవ్వలేదని నెపంతో గిరిబాబు బృందం నిలిపివేస్తే,  అధికారులతో మాట్లాడి పట్టాలు ఇప్పించిన ఈ విషయాన్ని మీరు మర్చిపోయారా గుర్తుచేశారు. గ్రామంలో వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా క్షీణించిందని పై బృందం చెప్పుచేతల్లో కొంతమంది గ్రామస్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సంక్షేమ పథకాలు అమలు విషయంలో చేతివాటం ప్రదర్శించి డబ్బులు గుంజిన వ్యక్తులు మీరు కాదా అని ప్రశ్నించారు. వాలంటీర్ ఉద్యోగం విషయంలో పేద కుటుంబానికి చెందిన ఒక వితంతు మహిళకు ఇవ్వాలని తాము కోరగా, ఆ ఉద్యోగాన్ని తన భార్యకు కావాలని నాయకుల వద్ద మోకరిల్లడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. భజన చేస్తున్నవారిని మార్కెట్ కమిటీ చైర్మన్ చిటికెల భాస్కర్ నాయుడు అందలం ఎక్కిస్తున్నారని, పార్టీ కార్యక్రమాలకు మమ్మల్ని ఆహ్వానించకపోవడం ఇదెక్కడి రాజకీయమని ప్రశ్నించారు.  ఈ విషయాలన్నీ నియోజకవర్గ స్థాయి వైఎస్సార్సీపీ నాయకులకు విన్నవించినా వారినే వెనుకేసుకు వస్తున్నారని చెప్పారు. మండల స్థాయి నాయకులు ఇదే విధమైన తీరును గ్రామంలో ప్రోత్సహిస్తూ పార్టీలో వర్గాలని ఏర్పాటు చేస్తున్నారని ఇలా అయితే రానున్న రోజుల్లో పార్టీ మనుగడకే ముప్పువాటిల్లే ప్రమాదముందన్నారు . ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు చుక్కల సత్తిబాబు, వార్డు మెంబర్లు భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు