జర్నలిస్టులు వారి కుటుబీకులకు కోవిడ్ బూస్టర్ డోస్ లు వేసే కార్యక్రమం చేపడతామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున ప్రకటించారు. ఈ మేరకు స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున తనను కలిసి కోవిడ్ నేపధ్య విపత్కర పరిస్థితులను అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ వివరించారు. ముఖ్యంగా ఈ కోవిడ్/ ఒమిక్రాన్ వేళ జిల్లా యంత్రాంగంతో పాటూ నిరంతరం సేవలను అందించడంలో తిరిగే జర్నలిస్టులూ అనేక మంది కోవిడ్ కు గురవుతున్నారని గుర్తు చేశారు. ఈ నేపధ్యంలో జర్నలిస్టులూ వారి కుటుంబ సభ్యులకూ (6 నెలలు పూర్తయిన వారికి) వేక్సిన్ రెండు డోసుల ప్రక్రియ ప్రాతిపదికన బూస్టర్ డోస్ లు వేసే వెసులుబాటు/అవకాశం కల్పించాలని కోరారు. అసోసియేషన్ తరపున జర్నలిస్టుల వారి కుటుంబాలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ సందర్భంగా వివరించారు. దీనికి కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున అభినందనలు తెలిపారు. అధ్యక్షుని అభ్యర్ధనకు సానుకూలంగా స్పందించారు. తక్షణమే డిఅండహెచ్వో కు అవసరమైన చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ సమర్పించిన లేఖపైనే సిఫార్సు చేస్తూ సంతకం చేశారు. జర్నలిస్టుల విషయంలో సానుకూలంగా స్పందించిన కలెక్టర్ గారికి అసోసియేషన్ తరపున అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. కలెక్టర్ ఆదేశాలతో త్వరలోనే జర్నలిస్టుల కు వారి కుటుంబ సభ్యులకూ కోవిడ్ బూస్టర్ డోస్ లు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వైద్యఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించిన వెంటనే సమాచారం కూడ తెలియజేస్తామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యం తో వర్ధిల్లాలని అశోక్ కుమార్ ఆశించారు. కలెక్టర్ ను కలిసి అసోసియేషన్ తరపున వినతి పత్రం అందించిన వారిలో కార్యదర్శి కాళ్ళ సూర్యప్రకాష్,ఉపాధ్యక్షులు మొల్లి లక్ష్మణ్ యాదవ్,సహాయ కార్యదర్సులు అబ్బిరెడ్డి చంద్రశేఖర్,బాలు పాత్రో,సహ సహాయ కార్యదర్శి కొండ్రి వినోద్,సభ్యులు జే. సూరిబాబు తదితరులు ఉన్నారు.