ప్రతి గిరిజన కుటుంబానికి రెండెకరాల భూమి


Ens Balu
1
గూడెంకొత్తవీధి
2020-09-15 15:44:39

విశాఖ ఏజెన్సీలో భూమిలేని గిరిజన కుటుంబాలను గుర్తించి కనీసం రెండెకరాల భూమికి హక్కు పత్రాలు పంపిణీ చేస్తామని పాడేరు ఐటిడిఏపీఓ  డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల స్పష్టం చేశారు. మంగళవారం జి.కె.వీధి మండలం దామనాపల్లి పంచాయతీ దొడ్డికొండ ,కట్టుపల్లి  సంకాడ పంచాయతీ చిన్న జాడమూరు గ్రామాల గిరిజన రైతులు సాగుచేస్తున్న అటవీ భూములను పరిశీలించారు. కాపీ తోటల్లో పర్యటించి  ఆర్వో ఎఫ్ ఆర్ భూముల్లో వేసిన సరిహద్దు రాళ్లను తనిఖీ చేశారు. కట్టుపల్లి గ్రామంలో కూడ సన్యాసిరావు ,చిన్న జాడమూరు గ్రామంలో దేసగిరి యుగంధర్ కాఫీ తోటల్లో పర్యటించి భూముల్లో వేసిన సరిహద్దు రాళ్లను తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడుతూ కాఫీ, మిరియాలసాగు పై వస్తున్న దిగుబడి,  ఆదాయాలను అడిగితెలుసుకున్నారు. కాఫీ రైతులకు కాఫీ పల్పర్ యంత్రాలను సరఫరా చేస్తామని చెప్పారు. గ్రామంలో తాగునీటి సమస్యలు, అంగన్వాడీ సేవలపైనా, రైతుభరోసా రైతులకు వచ్చిందా ని ఆడిగితెలుసుకున్నారు. చిన జాడమూరు గ్రామంలో పర్యటించి దేశగిరి యుగంధర్ కాఫీ తోటలు పరిశీలించారు. కాపీరైతులకు పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఐటీడీఏ నుంచి పసుపు విత్తనాలు పొంది సాగు చేస్తున్న పసుపురైతు  ఒలం బాబూరావు పసుపు తోటను సందర్శించారు. అనంతరం చాపరాతి పాలెం నుండి రాజేంద్రపాలెం వరకు రూ.785.40 లక్షలు వ్యయంతో పి.ఎం.జి.ఎస్ వై లో నిర్మిస్తున్న రోడ్ పనులను, పెడవలస గ్రామ పంచాయతీ, రైతు భరోసా కేంద్రం నిర్మాణపు  పనులు తనిఖీ చేశారు.  నిర్మాణాల్లో పటిష్టమైన నాణ్యతలు పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జి.కె.వీధి తహసీల్దార్, వి.రాజ్ కుమార్ ,పి.ఆర్ ఏ ఈ కె.జ్యోతిబాబు వి.ఆర్వో పద్మ తదితరులు పాల్గొన్నారు.