కరపలో 1336 ఓటిఎస్ రిజిస్ట్రేషన్లు పూర్తి..
Ens Balu
3
Karapa
2022-02-04 07:16:59
కరప మండలంలో ఇప్పటి వరకూ 1336 మందికి చెందిన ఓటిఎస్ రిజిస్ట్రేషన్లు పూర్తి అయినట్టుు కరప ఎంపీడీఓ కె.స్వప్న తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం ఆమె కరపలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. అంతేకాకుండా మండల వ్యాప్తంగా సుమారు 8వేల 689 మందికి చెందిన లబ్దిదారుల డేటాను కూడా ఆన్ చేసినట్టు చెప్పారు. మిగిలిన ఓటిఎస్ లబ్దిదారులకు ప్రభుత్వం కల్పించిన వాయిదాల పద్దతిని సచివాలయ సిబ్బంది ద్వారా తెలియజేస్తున్నట్టు ఆమె వివరించారు. ఓటిఎస్ వలన కలిగే లాభాలాను, ఉపయోగాలకు కూడా లబ్దిదారులకు తెలియజేస్తూ చైతన్యం కలిగిస్తున్నట్టు పేర్కొన్నారు. జాబితాలో పేర్లు ఉన్న లబ్దిదారులు స్వచ్చందంగా ముందుకువచ్చి ఓటిఎస్ ద్వారా తమ ఇంటి భూములు రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని కరప ఎంపీడీఓ కె.స్వప్న మీడియా ద్వారా మండల వాసులకు సూచించారు.