2610 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు..


Ens Balu
2
Sankhavaram
2022-02-04 07:52:52

శంఖవరం మండలం ఇప్పటి వరకూ 2620 మెట్రిక్ టన్నుల ధాన్యం1264 మంది రైతుల నుంచి కొనుగోలు పూర్తి చేసినట్టు  మండల వ్యవసాయాధికారి చంద్రశేఖర్ తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. 16 రైతుభరోసా కేంద్రాల పరిధిలోని ధాన్యం కొనుగోళ్లు దాదాపు పూర్తి అయ్యాయన్నారు. ప్రస్తుతం దాల్వాకి సంబంధించిన కార్యాచరణ జరుగుతుందని చెప్పారు. ఇంకా ఎవరి వద్దనైనా మిగిలిన ధాన్యం అమ్ముకోదలిస్తే తక్షణమే రైతు భరోసా కేంద్రాలకు తరలించి అమ్మకాలు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి చంద్రశేఖర్ తెలియజేశారు. అదేవిధంగా ఎవరికైనా పేమెంట్లలో ఇబ్బందులు, దాల్వా సాగులో సలహాలు, సూచనల కోసం రైతు భరోసా కేంద్రాల్లోని గ్రామీణ వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని ఈ సందర్భంగా రైతులకు మీడియా ద్వారా సూచించారు.

సిఫార్సు