1095 మెట్రిక్ టన్నుల ఎరువుల అమ్మకం పూర్తి..


Ens Balu
3
Karapa
2022-02-04 17:03:48

కరప మండలంలో ఒక వెయ్యి 95 మెట్రిక్ టన్నుల ఎరువులు ఇప్పటి వరకూ అమ్మకాలు పూర్తిచేసినట్టు కరప మండల వ్యసాయాధికారిణి ఏ.గాయత్రీ దేవి తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం మీడియాకి ప్రకటన విడుదల చేశారు. మండలంలో దాల్వా పంటలకు అనుగుణంగా ఎరువులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ 680 మెట్రిక్ టన్నుల యూరియా, 415 మెట్రిక్ టన్నుల డిఏపీ లను రైతులకు సరఫరా చేశామన్నారు. ఇటీవలే మండలానికి కావాల్సిన అదనపు ఎరువులను అందుబాటులోకి తేవాల్సిందిగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆదేశించారని తెలియజేశారు. మరో రెండు రోజుల్లో అదనపు ఎరువులు మండలానికి చేరుకుంటాయన్నారు. ఎరువులు లేవనే మాట రాకుండా అన్ని రైతు భరోసా కేంద్రాలు, ప్రైవేటు ఏజెన్సీల ద్వారా రైతులకు కావాల్సిన ఎరువులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ఆమె ఈ సందర్బంగా మీడియా ద్వారా మండలంలోని రైతులకు తెలియజేశారు.

సిఫార్సు