అన్నవరం శ్రీ సత్యదేవ నిత్యాన్నధాన ట్రస్టుకి రూ.లక్ష విరాళం..


Ens Balu
3
Annavaram
2022-02-05 09:07:27

అన్నవరంలోని శ్రీశ్రీశ్రీ వీర వేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో శ్రీ సత్యదేవ నిత్యాన్నధాన ట్రస్టుకి హైదరాబాదుకి చెందిన పితాని భానుప్రకాష్ దంపతులు శనివారం లక్షరూపాయలను విరాళం అందజేశారు. ఈ మేరకు ఈ మొత్తాన్ని ఈఓ కార్యాలయంలోని ఏఈఓకి అందజేశారు.  డిసెంబరు 5వ తేదిన రిష్వంత్ హన్యక్ పేరుపై అన్నదానం చేయాలని కోరారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతలకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేయగా, సిబ్బంది స్వామివారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు