అన్నవరంలోని శ్రీశ్రీశ్రీ వీర వేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో 7వ తేదిన జరగాల్సిన హుండీల లెక్కింపు భక్తుల రద్దీ కారణంగా 14వ తేదీకి మార్పుచేసినట్టు దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాధరావు తెలియజేశారు. ఈ మేరకు మీడియాకి ప్రకటన విడుదల చేశారు. మార్పుచేసిన తేదీలను ఆ రోజు విధుల్లోకి వచ్చే వారికి సమాచారం అందించినట్టు పేర్కొన్నారు.కాగా ప్రభుత్వం సూచించిన విధంగా కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ స్వామివారి హుండీల లెక్కింపు కార్యక్రమం చేపట్టనున్నట్టు ఈఓ వేండ్ర త్రినాధరావు మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.