స్వామివారిని దర్శించుకున్న దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణీమోహన్..


Ens Balu
3
Arasavilli
2022-02-08 08:33:59

రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జి.వాణీమోహన్ పేర్కొన్నారు. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భగా దేవాదాయ ధర్మాదాయ ప్రిన్సిపల్ సెక్రెటరీ మాట్లాడుతూ, రథసప్తమి జిల్లా కలెక్టర్, సూపరిండెంట్ ఆఫ్ పోలీస్, రెవెన్యూ, దేవాదాయ శాఖ తదితర శాఖల సమన్వయంతో రథసప్తమి వేడుకల ఏర్పాట్లు ఘనంగా నిర్వహించారన్నారు. జిల్లాలో నిర్వహించే రథసప్తమి వేడుకలకు రాష్ట్రంలో పలు జిల్లాల నుండే కాకుండా, పక్క రాష్ట్రం ఒరిస్సా నుండి కూడా భక్తులు తరలి వస్తున్నారనీ. స్వామి వారి నిజరూప దర్శనానికి చాలా ప్రాముఖ్యత ఉందని పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా  ఉచిత, 100/- , 500/- దర్శనాలుకు సంబంధించి బారికేడ్ల ఏర్పాటు, భక్తులకు మంచి నీరు, మజ్జిగ, ప్రసాదాలు పంపిణీ అన్నదానం ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. దేవాలయ అభివృద్ధికి ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగిందని.  ప్లాన్ ఆమోదం పొందిన వెంటనే దేవాదాయ, తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో పాటు దాతలు ఇచ్చిన విరాళాలతో దేవాలయ అభివృద్ధి చేపడతామన్నారు. ధర్మపథం కార్యక్రమాన్ని జిల్లాలో రెండు సార్లు నిర్వహించడం జరిగిందని, ప్రతి 15 రోజులలో 2 రోజులు ధర్మపథం నిర్వహించడం జరుగుతుందని ఆమె అన్నారు. తొలుత జిల్లా సహాయ కమీషనర్ శిరీష, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ స్వామి వారి ప్రసాదాన్ని  చిత్రపటాన్ని అందజేశారు.
సిఫార్సు