తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీశ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో రథసప్తమి సందర్భంగా మంగళవారం ఉదయం శ్రీ స్వామివారి వార్షిక కళ్యాణం మండపము నందు వైదిక సిబ్బంది సూర్య ఆరాధన, సూర్య నమస్కారములు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రథసప్తమికి సంబంధించిన ప్రవచనాలను కూడా వైదిక సిబ్బంది వినిపించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాధరావు, సిబ్బందితో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.