గ్రామాల్లో శ్రీరామ నగర సంకీర్తన అభినందనీయం..


Ens Balu
5
Prathipadu
2022-02-08 09:13:12

కొత్తపేట మండలం వానపల్లికి చెందిన ధరణాల శేఖర్ తన సొంత ఖర్చులతో ఆటోలో ధనుర్మాస ప్రారంభం నుంచి కొత్తపేట మండలంలోని అన్ని గ్రామాల్లో తన ఆటోపై  శ్రీరామ నామ నగరసంకీర్తన చేస్తూ ప్రతి ఒక్కరిలోనూ ఆధ్యాత్మిక చింతన కలిగించడం అభినందనీయమని ఆర్ఎస్ఎస్ నాయకులు కొనియాడారు. ఈ సందర్భంగా మంగళవారం కొత్తపేట జూనియర్ కాలేజీ సభా ప్రాంగణంలో కూరగాయలమార్కెట్ మహాగణపతి వర్తక సంఘం, ఆర్ఎస్ ఎస్ నాయకులు హిందూ బంధువుల ఆధ్వర్యంలో శ్రీరామ నామ నగరసంకీర్తన చేస్తున్న ధరణాల శేఖర్ ను ఘనంగా సత్కరించారు. శ్రీరామ నామ నగరసంకీర్తన వింటూ, రామ నామాన్ని జపిస్తూ  ప్రజలంతా మానసిక ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొందుతున్నారని పలువురు పెద్దలు ప్రశంసించారు. మరుగున పడిపోతున్న ఆచారాలను, సంస్కృతిని  కాపాడుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పండితులు పెద్దింటి రామం, బాపట్ల శ్రీను, ఆర్ఎస్ఎస్ నాయకులు శేషగిరి , శర్మ, బిజెపి నాయకులు పాలూరి సత్యానందం , మార్కెట్ కమిటీ సభ్యులు నిమ్మకాయల చిన్నయ్య నాయుడు , పాలాటి మాధవస్వామి, గొలకోటి వెంకటేశ్వరరావు , కోటిపల్లి దామోదర్, శ్రీనివాస్,  మార్కెట్ కమిటీ సభ్యులు హిందూ బంధువులు పాల్గొన్నారు. 
సిఫార్సు