ఖాకీ అంటే కర్కసమే కాదు.. అంతకు మించిన కారుణ్యం కూడా..


Ens Balu
4
Mandapeta
2022-02-10 10:45:45

ఖాకీలు అంటే కర్కసంగా వ్యవహరిస్తారని మిత్రామే అందరికీ తెలుసు..అది వారు కావాలని చేస్తున్నది కాదు విధినిర్వహణలో ఆమాత్రం చేయకపోతే  ప్రజాక్షేత్రంలో పోలీసులంటే నింధితులకు భయం వుండదు..అలాంటి పోలీసులు ఎప్పుడూ కర్కసంగానే ఉంటారా..కాదు కాదు.. అంతకు మించిన మానవత్వాన్ని, మరింత కారుణ్యాన్ని కూడా ప్రదర్శిస్తారు. ప్రజలను కాపాడతారు. తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట టౌన్ పోలీస్ స్టేషన్ లో అక్కడి పోలీసులు చూపిన చొరవ, మానవసేవ నిజంగా పోలీసులపై నమ్మకాన్ని మరింత పెంచుతాయనడంలో సందేహం లేదు. వివరాలు తెలుసుకుంటే.. మండపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూజీ స్కూల్ 7th వార్డ్ కు చెందిన కొడమంచిలి రత్నకుమారి  తన భర్త  తరచూ మద్యం సేవించి గొడవచేస్తుండగా..దానిని వారించిన భార్యను అతడు కత్తపీట చెక్కతో తలపై మోదాడు. తీవ్ర రక్తస్రావంతో పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితురాలికి..ఏఎస్ఐ జి.చిన్నారావు, మహిళా కినిస్టేబుల్ మంగాదేవిలు ప్రధమ చికత్స చేసే క్రమంలో ఏఎస్ఐ తన జేబు రుమాలుతో బాధితురాలి గాయానికి కట్టు కట్టి. ఆమెను ఆసుపత్రికి తరలించారు.  ప్రజల రక్షణలో అంతికత భావంతో పనిచేయడంలోనూ పోలీసులు ముందుంటారనే విషయాన్ని జిల్లాలో మండపేట పోలీసులు మరోసారి రుజువుచేసి చూపారు.  మానవత్వాన్ని ప్రదర్శించి, బాధితురాలిని ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి సేవలు సహచర ఉద్యోగులకు మార్గదర్శకమంటూ అభినందించారు.. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతు పోలీసులు చేసిన సహాయానికి ప్రజలంతా సెల్యూట్ చేస్తున్నారు..
సిఫార్సు