కర్నూలుకి దామోదరం సంజీవయ్య పేరుపెట్టాలి..


Ens Balu
2
Kakinada
2022-02-14 09:39:31

దామోదరం సంజీవయ్య శత జయంతి సందర్భంగా జవహార్ వీధిలోనికాకినాడ పౌరసంక్షేమ సంఘం కార్యాలయంలో ఘనంగా నివాళి ఘటించారు. ఈ సందర్భంగా సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ  రాష్ట్రానికి 2 వ ముఖ్యమంత్రి గా దళిత వర్గాల నుండి మొదటి ముఖ్యమంత్రి గా నెహ్రూ లాల్ బహుదూర్ శాస్త్రి ప్రధానులుగా పనిచేసిన హయాంలో దేశ కార్మిక మంత్రిగా వున్న దామోదరం సంజీవ య్య నిజాయితీగా ప్రజోపయోగ పనులు చేసిన మహనీయులని శ్లాఘించారు. కార్మికులకు బోనస్ ప్రవేశపెట్టడం 6లక్షల బంజరు భూములు పంపిణీ చేయించడం ఎస్ సి ఎస్ టి బి సి లకు ఉద్యోగపదోన్నతులు కల్పించడం మద్య నిషేధానికి చర్యలు వహించడం అవినీతి నిరోధక శాఖ ను ఏర్పాటు చేయడం తెలుగును మొదటి అధికార భాషగా ఉర్దూను రెండవ అధికార భాషగా చేయడం  వంటి పనులు సంజీవయ్య హయాంలో అమలుచేసిన మహోన్నత కార్యాలని పేర్కొన్నారు. సంజీవయ్య పుట్టిన  జిల్లాకు దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లాగా నామకరణం చేయడం అభినందనీయం అవుతుందని పేర్కొన్నారు. భవిష్యత్ రాజకీయాలకు ఆయన ఆదర్శప్రాయమని పూల మాలలు వేసి అంజలి ఘటించారు. తెదేపా ఎస్ సి సెల్ నాయకుడు పోలిపల్లి జగన్ బాబు వివేకా అభ్యుదయ సేవా సమితి అధ్యక్షులు పెంకే నూకరాజు సీనియర్ సిటిజన్ పట్టా రామదాసు పాల్గొన్నా రు.
సిఫార్సు