ఈ నెల16న లక్ష్మీపురంలో మెగా వైద్య శిబిరం..


Ens Balu
2
Paderu
2022-02-14 12:50:38

పాడేరు రెవిన్యూ డివిజన్ పరిధిలోని ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం లో ఈనెల 16వ తేదీన ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాల క్రిష్ణ  సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. గైనిక్ వైద్య నిపుణులు, చర్మ వ్యాధుల వైద్య నిపుణులు, కీళ్ళ వ్యాధుల వైద్య నిపుణులు, కంటి వైద్యులు, చెవి, ముక్కు, గొంతు వైద్యులు, సాధారణ వ్యాధులు వైద్య నిపుణులు కంటి వైద్యులు పాల్గొనిఉచితంగా వైద్యం ,మందులు సరఫరా చేస్తారని పేర్కొన్నారు.  లక్ష్మీపురం ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలో నిర్వహిస్తున్న వైద్య శిబిరంలో వైద్యం పొందాలని సూచించారు. మండలంలోని ప్రజలందరూ వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
సిఫార్సు