ఓటరు జాబితాలో తప్పులు, అడ్రసులను నవీకరించుకోవాలి..


Ens Balu
2
Sankhavaram
2022-02-15 09:06:38

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలమేరకు ఓటరు కార్డులోని తప్పులను, శాస్వత అడ్రసులను మార్చుకోదలచిన వారు తక్షణమే గ్రామసచివాలయాలను సంప్రదించి నవీకరణలు చేయించుకోవాలని శంఖవరం మహిళా పోలీస్ జిఎన్ఎస్.శిరీష కోరారు. ఈ మేరకు ఆమె శంఖవరం మండల కేంద్రంలోని గ్రామసచివాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించిన ఈ అవకాశాన్ని ఓటరు దారు తన కార్డులోని శాస్వత అడ్రసుతోపాటు ఇతర మార్పులను, చేర్పులను నవీకరించుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలను మహిళా పోలీస్ జీఎన్ఎస్ శీరిష కోరారు.
సిఫార్సు