సచివాలయ మహిళా పోలీస్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి..
Ens Balu
7
Mandapam
2022-02-15 09:07:40
శంఖవరం మండలలోని మండపం గ్రామ సచివాలయం పరిధిలోని మహిళా పోలీసుల సేవలు ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలిన సచివాలయ మహిళా పోలీస్ వి.గౌతమి గ్రామస్తులను కోరారు. ఈ మేరకు ఆమె గ్రామసచివాలయంలో మీడియాతో మాట్లాడారు. గ్రామంలోని మహిళలకు, వివాహితులకు ఎలాంటి కష్టం వచ్చినా తక్షణమే సచివాలయాల్లోని మహిళాపోలీసులను సంప్రదించాలన్నారు. అదే సమయంలో విద్యార్ధినులతోపాటు, గ్రుహిణిలు కూడా దిశ యాప్ ను ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇనిస్టాల్ చేసుకోవాలన్నారు. అత్యవసర సమయంలో దిశయాప్ మహిళలకు ఎంతో రక్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా సచివాలయ పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా తమకు సమాచారం అందించాలని కోరారు.