గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై విద్యార్ధినిలు అవగాహన కలిగి ఉండాలి..


Ens Balu
2
Mandapam
2022-02-21 16:33:34

అపరిచితులు విద్యార్ధులను నిర్జన ప్రదేశాల్లో తాక కుండా జాగ్రత్తలు పాటించాలని మండ పం గ్రామసచివాలయ మహిళా పోలీస్ వి.గంగాగౌతమి విద్యార్ధినిలకు సూచించారు. సోమ వారం శంఖవరం మండలంలోని మండపం గ్రామంలోని సత్యభారతి పబ్లిక్ స్కూలులో గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, రహదారి ప్రమాదాలపై విద్యార్ధులకు జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న చేతన కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ గంగగౌతమి  మాట్లాడుతూ, స్కూలు విద్యార్ధినిలు తెలియని వ్యక్తులతో మాట్లాడే సమయంలో వారికి దౌరంగా నిలబడాలన్నారు. అంతేకాకుండా ఎవరైనా చేయి వేసి మాట్లాడటానికి ప్రయత్నిస్తే వ్యతిరేకించాలని, చేయి వేయకుండా మాట్లాడాలని దైర్యంగా సమాధానం చెప్పాలని అవగాహన కల్పించారు. ఏఏ ప్రద్యేశాల్లో తాకితో గుడ్ ట్ అవుతుంది. ఏఏ ప్రదేశాల్లో తాకితే బ్యాడ్ టచ్ అవుతుందో విద్యార్ధినిలకు అవగాహన కల్పించారు. వాటితోపాటు స్కూలు విద్యార్ధులకు రహదారిభద్రత, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డుపై నడిచే టపుడు ఎడమవైపునే ఎందుకు నడవాలి తదితర అంశాల కోసం విపులంగా ప్రత్యేకంగా తయారు చేసిన చార్టుల ద్వారా వివరించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించే సమయంలో ప్రమాదాలు జరిగితే కలిగే నష్టాల కోసం కూడా విద్యార్ధులకు తెలియజేశారు. ఈకార్యక్రమంలో స్కూలు ఉపాధ్యాయులు కోలా చందర్రావు, పన్నీరు సత్యన్నారాయణ, ఇతర స్కూలు సిబ్బంది అధిక సంఖ్యలో విద్యార్ధులు పాల్గొన్నారు.
సిఫార్సు