రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్ధులు అవగాహన పెంచుకోవాలి..


Ens Balu
4
Nellipudi
2022-02-21 16:54:54

రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలు,  రోడ్డు ప్రమాదాలపై విద్యార్ధులు పాఠశాల దశ నుంచే  అవగాహన పెంచుకోవాలని నెల్లిపూడి గ్రామసచివాలయ మహిళా పోలీస్ కళాంజలిసూచించారు. సోమవారం శంఖవరం మండలం నెల్లిపూడి ఎంపీపీ స్కూలులో సోమవారం రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, రహదారి ప్రమాదాలపై విద్యార్ధులకు జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న చేతన కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ కళాంజలి  మాట్లాడుతూ, స్కూలు విద్యార్ధులు రోడ్డుపై నడిచేటప్పుడు రోడ్డుకి ఎడమవైపు నుంచి క్యూలైన్  పాటిస్తూ నడవటం అలవాటు చేసుకోవాలన్నారు.. అంతేకాకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ లో రెడ్ లైన్  పడినపుడు వాటిని చూసుకుంటూ గ్రీన్ లైట్ పడేంత వరకూ వేచి చూసి ఆ తరువాత  జీబ్రా లైన్ గుండా మాత్రమే నడవాలన్నారు. అంతేకాకుండా ద్విచక్రవాహనాల్లో వెళ్లే సమయంలో హెల్మెట్ లేకుండా, అత్యంత వేగంగా ప్రయాణాలు చేయడం వలన  అనర్ధాలను వివరించారు. కారు ప్రయాణంలో సీటు బెల్టు పెట్టుకొని ప్రయాణం చేయడం ద్వారా కలిగే లాభాలు, అదేవిధంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ, మద్యం తాగి  వాహనాలు నడపడం వలన వచ్చే అనర్ధాలపై విద్యార్ధులకు ప్రత్యేకంగా తయారు చేసిన చార్టులను ప్రదర్శిస్తూ  చైతన్యం కల్పించారు.  తల్లిదండ్రులకు  ఎవరికైనా ఇంట్లో ద్విచక్రవాహనాలు ఉంటే, వారు బయటకు వెళ్లే సమయంలో ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పాలని సూచించారు. అదేవిధంగా కార్లు ఉన్నవారు ప్రయాణ సమయంలో ఖచ్చితంగా సీటు బెల్టు పెట్టుకొని మాత్రమే ప్రయాణాలు చేయాలని..ఆ విషయాన్ని విద్యార్ధులు తల్లిదండ్రులకు తెలియజేయాలని చెప్పారు. ఈ అవగాహనా కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అధిక సంఖ్యతో విద్యార్ధులు పాల్గొన్నారు.
సిఫార్సు