గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై విద్యార్ధినిలు అవగాహన కలిగి ఉండాలి..
Ens Balu
6
Nellipudi Village
2022-02-22 10:01:12
మనకి తెలియని వ్యక్తులు విద్యార్ధినిలను నిర్జన ప్రదేశాల్లో తాక కుండా జాగ్రత్తలు పాటించాలని నెల్లిపూడి గ్రామసచివాలయ మహిళా పోలీస్ కళాంజలి విద్యార్ధినిలకు సూచించారు. మంగళవారం శంఖవరం మండలంలోని నెల్లిపూడి గ్రామంలోని ఎంపీపీ స్కూలులో గుడ్ టచ్ లపై విద్యార్ధులకు జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న చేతన కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ కళాంజలి మాట్లాడుతూ, స్కూలు విద్యార్ధినిలు తెలియని వ్యక్తులతో మాట్లాడే సమయంలో వారికి దూరంగా నిలబడాలన్నారు. అంతేకాకుండా ఎవరైనా చేయి వేసి మాట్లాడటానికి ప్రయత్నిస్తే వ్యతిరేకించాలని, చేయి వేయకుండా మాట్లాడాలని దైర్యంగా సమాధానం చెప్పాలని.. అది ఏవిధంగా ఉంటుందో ఇద్దరు విద్యార్ధినిలతో చేతులతో తాకి చూపించి విద్యార్ధినిలకు అర్ధమయ్యేలా అవగాహన కల్పించారు. ఏఏ ప్రద్యేశాల్లో తాకితో గుడ్ ట్ అవుతుంది. ఏఏ ప్రదేశాల్లో తాకితే బ్యాడ్ టచ్ అవుతుందో విద్యార్ధినిలకు అవగాహన కల్పించారు. ఎవరైనా స్కూలుకి వెళ్లే సమయంలోగానీ, వచ్చే సమయంలో ఏడిపించినా, హేలన చేసినా దైర్యంగా వారికి సమాధానం చెప్పాలన్నారు. అప్పటికీ శ్రుతిమించితే ఇంటిదగ్గర తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని దైర్యంగా చెప్పడం అలవాటు చేసుకోవాలన్నారు. అంతేకాకుండా పాఠశాలలకు దగ్గర్లో వున్న గ్రామ సచివాలయాల్లో ఉండే తమకు కూడా నేరుగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చునని తెలియజేశారు. ఈకార్యక్రమంలో స్కూలు ఉపాధ్యాయులు డి.బుల్లి అప్పారావు, మూర్తి, దేవిశ్రీ, అధిక సంఖ్యలో విద్యార్ధులు పాల్గొన్నారు.