చేతన ద్వారా వినూత్న రీతిలో విద్యార్ధులకు 5 అంశాలపై అవగాహన..
Ens Balu
3
Nellipudi Village
2022-02-23 17:40:52
పాఠశాల విద్యార్ధులు ప్రాధాన్యత కలిగిన రహదారి భద్రత, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, మత్తు పదార్ధాల సేవనం అనర్ధాలు, సైబర్ క్రైం, ట్రాఫిక్ నిబంధనలు అనే అంశాలపై పాఠశాల స్థాయినుంచే పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని నెల్లిపూడి గ్రామసచివాలయ మహిళా పోలీస్ కళాంజలి పేర్కొన్నారు. శంఖవరం మండలంలోని నలుగురు మహిళా పోలీసులు వినూత్నంగా వ్యవహరించి బుధవారం టి.అగ్రహారం ఎంపీపీ స్కూలులో జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న చేతన కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా విద్యార్ధులకు చైతన్యం కలిగించారు. మహిళా పోలీసులు పిఎస్ఎస్.కళాంజలి, జిఎన్ఎస్ శిరీష, గంగ గౌతమి, నాగమణిలు విద్యార్ధులు ఐదు అంశాలపై విద్యార్ధులతోనే స్కిట్లు వేయించి మరీ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులు మాట్లాడుతూ, ప్రభుత్వం, పోలీస్ శాఖ ఉన్నత లక్ష్యంతో విద్యార్ధులకు పాఠశాల స్థాయి నుంచే చైతన్యం కల్పించడానికి చేతన కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు. పాఠశాలశాల స్థాయి విద్యార్ధులు ఈ విషయాలను క్షుణ్ణంగా అర్ధం చేసుకోవడం ద్వారా ప్రాధమిక విద్య పూర్తి అయ్యేలోపు అన్నీ అవగతం అవుతాయని సూచించారు. చెప్పిన విషయాలన్నీ విద్యార్ధులు నిత్యం గుర్తు పెట్టుకుంటూ పాఠశాలకు వచ్చి వెళ్లే సమయంలో ఒకరికి ఒకరు చెప్పుకుంటూ చైతన్యం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లిపూడి సర్పంచ్ నరాల శ్రీనివాస్, కార్యదర్శి కె.శ్రీనివాసరావు, పాఠశాల హెచ్ఎం ఆశాజ్యోతి, పివీఆర్ మూర్తి, సత్యన్నారాయణ, సచివాలయ గ్రామ వాలంటీర్లు అధిక సంఖ్యలో విద్యార్ధులు పాల్గొన్నారు.