వార్డు అభివ్రుద్ధికే పెద్దపీట..పీతల మూర్తి
Ens Balu
3
Visakhapatnam
2022-02-24 06:31:47
మహివిశాఖ నగరపాలక సంస్థలోని తమవార్డు సమస్యలు పరిష్కారం తో పాటు, అభివృద్ధి పథంలో నడిపించడమే ధ్యేయంగా పని చేస్తానని జీవీఎంసీ 22వ వార్డు పీతల మూర్తి యాదవ్ చెప్పారు. వార్డులోని న్యూరేసపువానిపాలెంలో గురువారం రూ.16.45 లక్షలతో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ న్యూ రేసపువానిపాలెం, సిద్దార్ధ నగర్ రోడ్ లో అండర్ డ్రైనేజీ నిర్మాణానికి ఈ పనులు ప్రారంభించమన్నారు. ఇక్కడ భూగర్భ డ్రైనేజి వ్యవస్థ లేకపోవడం స్థానికులు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. వారి సమస్యలు పరిష్కరించాలని అండర్ డ్రైనేజి పనులు చేపట్టామన్నారు. అలాగే వార్డులో ఇప్పటికే పలు సమస్యలను పరిష్కరించామన్నారు. రోడ్డు మరమ్మతులు, నూతన విద్యుత్ పోల్స్ , విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశామన్నారు. వార్డులో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రతిపాదనలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ వర్క్స్ ఏఈ జాన్సన్ విల్సన్, జీవీఎంసీ అధికారులు రామకృష్ణ, ప్రసాద్, మాధవ్, జగన్, సతీష్, బంగార్రాజు, సూరిబాబు, జనసేన నాయకులు ధనలక్ష్మి, శేఖర్, శ్రీను, గుణ, లక్ష్మీ, దుర్గారావు, పెసల శ్రీను, రవి పాల్గొన్నారు.