విద్యార్ధులు సైబర్ క్రైమ్ పై చైతన్యం పెంచుకోవాలి..
Ens Balu
5
Nellipudi Village
2022-02-24 10:51:05
విద్యార్ధులు పాఠశాల దశ నుంచే సైబర్ క్రైమ్ పై అవగాహన పెంచుకోవాలని నెల్లిపూడి గ్రామసచివాలయ మహిళా పోలీస్ పిఎస్ఎస్ కళాంజలి చైతన్యం కల్పించారు. ఈ మేరకు శంఖవరం మండలంలోని కొంతంగి ఎంపీపీ స్కూలులో విద్యార్ధులకు జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న చేతన కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా విద్యార్ధులకు చైతన్యం కలిగించారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులు పిఎస్ఎస్.కళాంజలి మాట్లాడుతూ,ఎవరైనా తెలియని ఫోన్ చేసి ఇంటి అడ్రసు, బ్యాంకు పాస్ బుక్ నెంబరు చెప్పమన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాంటి వారు సైబర్ నేరగాళ్లని గుర్తించుకోవాలన్నారు. సెల్ ఫోన్ లో ఎవరికీ మన వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ ఏటిఎం నెంబరు, బ్యాంకు పాస్ బుక్ నెంబర్లు కూడా ఇవ్వకూడదని సూచించారు. అంతేకాకుండా విద్యార్ధులు డబ్బులు పెట్టి ఆన్ లైన్ గేమ్స్ ఆడే అలవాట నుంచి బయటపడాలన్నారు. అనంతరం రహదారి భద్రత, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, మత్తు పదార్ధాల సేవనం అనర్ధాలు, ట్రాఫిక్ నిబంధనలు అనే అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చైతన్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎన్వి సత్యన్నారాయణ, వైపీ శ్యామ్ కుమార్, సిహెచ్వీమధుబాబు, ఏ.సత్యన్నారాయణ, సర్పంచ్ శివ, గ్రామవలంటీర్లు తదితరలు పాల్గొన్నారు.