మత్తుపదార్ధాలతో జీవితాలు చిత్తుగా మారిపోతాయి..
Ens Balu
3
Velangi
2022-02-25 11:32:21
పాఠశాల విద్యార్ధులు మత్తుపదార్ధాల సేవనం, అనర్ధాల పట్ల అవగాహన పెంచుకోవడం ద్వారా వాటి జోలికి వెళ్లకుండా ఉండేందుకు ఆస్కారం వుంటుందని వేలంగి గ్రామసచివాలయ మహిళా పోలీస్ జర్తా నాగమణి సూచించారు. శంఖవరం మండలం వేలంగి ఎంపీపీ స్కూలులో విద్యార్ధులకు శుక్రవారం మత్తుపదార్ధా వినియోగం, నష్టాలు అనే అంశంపై విద్యార్ధులకు జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న చేతన కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ నాగమణి మాట్లాడుతూ, మత్తు పదార్ధాలు సేవించడం ద్వారా జీవితాలు చిత్తుగా మారిపోతాయన్నారు. విద్యార్ధులు వాటికోసం తెలుసుకోవడం ద్వారా వాటికి దూరంగా ఉండవచ్చునన్నారు. అనంతరం రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నిబంధనలు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, సైబర్ క్రైమ్ తదితర ఐదు అంశాలపై కూడా విద్యార్ధులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం గుండునూకరాజు, సర్పంచ్ మేకల సత్యన్నారాయణ, పాఠశాల విద్యార్ధులు పాల్గొన్నారు.