విద్యార్ధులు సైబర్ నేరాలపట్ల అవగాహన పెంచుకోవాలి.. మహిళా పోలీస్ శిరీష..
Ens Balu
2
Sankhavaram
2022-02-25 11:34:28
విద్యార్ధులు పాఠశాల దశ నుంచే సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచుకోవాలని శంఖవరం గ్రామసచివాలయ మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష చైతన్యం కల్పించారు. ఈ మేరకు శుక్రవారం శంఖవరం మండల కేంద్రంలోని ఎంపీపీ స్కూలులో జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న చేతన కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా విద్యార్ధులకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులు జిఎన్ఎస్ శిరీష మాట్లాడుతూ, ఫోన్ లో మాట్లాడేటపుడు, సోషల్ మీడియాలోనూ తెలియని వారి పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఫోన్ చేసి ఇంటి అడ్రసు, బ్యాంకు పాస్ బుక్ నెంబరు చెప్పమన్నప్పుడు అలాంటివి మీకెందుకు చెప్పాలంటూ దైర్యంగా తిరస్కరించాలన్నారు. ఎవరైనా ఫోన్ లోనే వివరాలు చెప్పాలని బెదిరిస్తే దగ్గర్లోని పోలీస్ స్టేషన్ ఫోన్ కాల్ వచ్చిన మీ నెంబరుపై ఫిర్యాదు చేస్తామని దైర్యంగా చెప్పాలన్నారు. అలాంటి వారు సైబర్ నేరగాళ్లు అనే విషయాన్ని విద్యార్ధులు గుర్తించుకోవాలన్నారు. సెల్ ఫోన్ లో ఎవరికీ మన వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదని సూచించారు. అంతేకాకుండా విద్యార్ధులు డబ్బులు పెట్టి ఆన్ లైన్ గేమ్స్ ఆడే అలవాటుకి దూరంగా ఉండాలన్నారు. అనంతరం రహదారి భద్రత, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, మత్తు పదార్ధాల సేవనం అనర్ధాలు, ట్రాఫిక్ నిబంధనలు అనే అంశాలపై చైతన్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీషతో పాటు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పార్ధసారధి, అధిక సంఖ్యలో విద్యార్ధులు పాల్గొన్నారు.