బొలిశెట్టిగోవిందరావుపై ఎస్సీఎస్టీ కేసు నమోదు చేయాలి..
Ens Balu
3
s.rayavaram
2020-09-16 08:25:46
పాయకరావుపేట ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ ఎస్సీ, ఎస్టీ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ గొల్లబాబూరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీటీసీ బొలిశెట్టి గోవిందరావు పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘ నాయకుడు పిట్టా విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఎస్.రాయవరం లో మీడియాతో మాట్లాడుతూ, దళిత ఎమ్మెల్యే అయిన గొల్ల బాబూరావుపై ఒక మాజీ ఎంపీటీసీ ఇష్టానుసారం వచ్చినట్టు, నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మా ట్లాడటం దళితులను కావాలని కించపరడమేనన్నారు. ఆ వ్యాఖ్యలను ఎస్.రాయవరం0 మండల సంఘం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. దళిత ఎమ్మెల్యేపై అగ్రకు లాల పెత్తనాన్ని ప్రతీ దళితుడూ వ్యతిరేకించాలన్నారు. ఇలాంటి వైఎస్సార్సీపీ నాయకులపై అధిష్టానం క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలన్నారు. అధికాపార్టీ దళిత ఎమ్మెల్యేపై చేసిన ఈ వ్యాఖ్యలను పార్టీలకు అతీతంగా అంభేత్కర్ వారసులంతా ముక్త కంఠంతో ఖండించాలన్నారు. అదేవిధంగా పాయకరావుపేట ఎమ్మెల్యే విషయంలో టిడిపి ఎస్సీసెల్ నాయకులు వైఎస్సార్సీపీ పార్టీపై చేసి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేకులను ప్రోత్సహించదన్నారు. దళితులంతా ఒక్కటేనని విషయాన్ని చాటిచెబుతామని, మండలంలోనూ, జిల్లాలోని దళితులంతా ఎమ్మెల్యే బాబూరావు వెనుకే వుంటారని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ విషయాన్ని దళిత సంఘాల సమాఖ్య సీరియస్ గా తీసుకుందని పిట్టా విజయ్ కుమార్ వివరించారు.