సేవా టిక్కెట్ల పెంపుదల నిర్ణయాన్ని ఉపహరించుకోవాలి.. పాలూరి
Ens Balu
3
Prathipadu
2022-02-26 11:16:39
శ్రీవారి ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరులుగా చూస్తూ ఆర్జిత సేవల ఛార్జీల పెంపు- సామాన్య, పేద హింధువులను శ్రీవారికి దూరం చేయడమేనని పాలూరి సత్యానందం ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. శనివారం ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రభుత్వనికి సినిమా టిక్కెట్లు మీధ ఉన్న ప్రేమ తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల చార్జీలు మీద లేదు ఎందుకని, రాష్ట్ర ప్రభుత్వం హింధువులను వారి దేవుడులకు దూరంచేసే విధంగా తీసుకున్న నిర్ణయంగా ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల చార్జీలను భారీగా పెంచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, టిటిడి పాలకమండలి సభ్యుల ప్రవర్తన నిర్ణయాలు భక్తులను స్వామికి దూరం చేసే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. గతంలో శ్రీవారి ఆర్జిత సేవల్లో సుప్రభాతం రూ.120లు తోమాల, అర్చన సేవలకు రూ.220లు, నిజపాద దర్శనం రూ.250లు, కల్యాణోత్సవం రూ.1000లు వేద ఆశీర్వచనం రూ.3000లుగా ఉండేవని, నేడు ఆ ఛార్జీలను టిటిడి పాలకమండలి సుప్రభాతం రూ.2000లు తోమాల,అర్చన రూ.5000లు వేద ఆశీర్వచనం రూ.10000లు కళ్యాణోత్సవం రూ.2500లకు పెంచడం ఎంతవరకు సమంజసమన్నారు. సామాన్య ప్రజలు సేవలు ఎలా పొందగలరని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం టిటిడి పాలకమండలి సభ్యులు తీసుకుంటున్న నిర్ణయాలు సామాన్య పేధ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. తిరుమల శ్రీవారి సేవల్లో పాల్గొనడం హిందువులు అదృష్టంగా భావిస్తారని, అలాంటి సేవలకు ఛార్జీలు పెంచడం ద్వారా సామాన్య ప్రజలకు దూరం చేయవద్దని, దీనిపై ప్రభుత్వం, టిటిడి పాలకమండలి సభ్యులు పునరాలోచన చేసి, పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా ఛార్జీలను నిర్ణయించాలని పాలూరి కోరారు.