గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై విద్యార్ధినిలు అవగాహన పెంచుకోవాలి..
Ens Balu
3
Pedamallapuram
2022-02-26 11:39:55
మనం బయటకు వెళ్లే సమయాల్లో తెలియని వ్యక్తులు చనువు తీసుకొని మాట్లాడే సమ యంలో నిర్జన ప్రదేశాల్లో తాక కుండా విద్యార్ధినిలు జాగ్రత్తలు పాటించాలని పెదమల్లాపురం గ్రామసచివాలయ మహిళా పోలీస్ నాగమణి విద్యార్ధినిలకు సూచించారు. శనివారం శంఖవరం మండల పెద మల్లాపురం గిరిజన సంక్షేమ ఆశ్ర ఉన్నత పాఠశాలలో గుడ్ టచ్ లపై విద్యార్ధులకు జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న చేతన కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ నాగమణి మాట్లాడుతూ, స్కూలు విద్యార్ధినిలు తెలియని వ్యక్తులతో మాట్లాడే సమయంలో వారికి దూరంగా నిలబడాలన్నారు. అంతేకాకుండా ఎవరైనా చేయి వేసి మాట్లాడటానికి ప్రయత్నిస్తే వ్యతిరేకించాలని, చేయి వేయకుండా మాట్లాడాలని దైర్యంగా సమాధానం చెప్పాలని సూచించారు. విద్యార్ధినిలకు అర్ధమయ్యేలా ఏఏ ప్రద్యేశాల్లో తాకితో గుడ్ ట్ అవుతుంది. ఏఏ ప్రదేశాల్లో తాకితే బ్యాడ్ టచ్ అవుతుందో విద్యార్ధినిలకు చైతన్యం కల్పించారు. అనంతరం సైబర్ క్రైమ్, రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఎం.శ్రీనివాస్, ఇతర ఉపాధ్యాయినిలు, విద్యార్ధినిలు పాల్గొన్నారు.