ఎస్ఐ శోభన్ కుమార్ ను మర్యాదపూర్వంగా కలిసిన మహిళా పోలీసులు..


Ens Balu
5
Annavaram
2022-02-26 16:51:20

అన్నవరం స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన శోభన్ కుమార్ ను శంఖ వరం మండలంలోని అన్ని గ్రామసచివాలయాలకు చెందిన మహిళా పోలీసులు మర్యాద పూర్వకంగా కలిసి పరిచియం చేసుకున్నారు. ఈ మేరకు శనివారం సచివాలయ మహిళా పోలీసులు ఎస్ఐని కలిసి అభినందనలు తెలియజేశారు. ఈసందర్భంగా ఎస్ఐ శోభన్ కుమార్ గ్రామసచివాలయ మహిళా పోలీసులతో సమీక్ష నిర్వహించారు.  అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ, గ్రామస్థాయిలో ప్రజలకు రక్షణగా నిలవాలన్నారు. ముఖ్యంగా పోలీసు సేవలు ప్రజలు అందేలా చూడటంతోపాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశయాప్ ను విద్యార్ధినిలు, మహిళలతో వారి మొబైల్ ఫోన్లలో ఇనిస్టాల్ చేయించి దాని ఉపయోగాలు, వినియోగం వారికి తెలిసేలా చైతన్యం తీసుకురావాలని సూచించారు. త్వరలోనే స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామసచివాలయాలను సందర్శిస్తానని చెప్పారు. ఎస్ఐని కలిసిన వారిలో సచివాలయ మహిళా పోలీసులు, పిఎస్ఎస్ కళాంజలి, జిఎన్ఎస్ శిరీష, గంగ గౌతమి, దుర్గ, స్వర్ణలత, యరకయ్యమ్మ, నీలిమ, రజియాసుల్లానా, రమ్యశ్రీ, చైతన్య, ఉమ అంజని, శ్రావణి, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు