పోలియో నిర్మూలనకు రెండే రెండు చుక్కలు..
Ens Balu
3
Jogumpeta
2022-02-27 05:08:47
పసిపిల్లలను జీవచ్ఛవాలుగా చేసి వారి బంగారు భవిష్యత్తును నరకప్రాయం చేసే పోలియో వ్యాధి ని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని గొలుగొండ వైస్ ఎంపీపీ జక్కు నాగమణి పేర్కొన్నారు. ఆదివారం జోగుంపేట గ్రామంలో సర్పంచ్ జువ్వల లక్ష్మితో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 1995 నుంచి ప్రతి ఏటా పల్స్ పోలియో టీకాల కార్యక్రమం జరుగుతుండడంతో పోలియో వ్యాధి నిర్మూలన జరుగుతుందన్నారు. భవిష్యత్తులో ఈ వ్యాధి రాకుండా ఉండటం కోసం అప్పుడే పుట్టిన బిడ్డ నుండి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని వైస్ ఎంపీపీ జక్కునాగమణి సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు, పిల్లల తల్లులు పాల్గొన్నారు.